వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ? ఇది మీకు తెలుసా?

వినాయక చవితి ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే ముందు మనం తెలుగు నెలలు, పక్షాలు మరియూ తిధుల గురించి తెలుసుకోవాలి.
ఇంగ్లీష్ లో 12 నెలల/మాసాలుు ఉన్నాటుగానే తెలుగులో 12 నెలల/మాసాలుు ఉంటాయి.

తెలుగు నెలల/మాసాల
SNO English Month Telugu Month English Names
1 March - April చైత్రము - First Month Chaitramu
2 April - May వైశాఖము - Second Month Vaisakhamu
3 May - June జ్యేష్ఠము - Third Month Jyeshtamu
4 June - July ఆషాఢము - Fourth Month Ashadamu
5 July - August శ్రావణము - Fifth Month Sravanamu
6 August - September భాద్రపదము - Sixth Month Bhadrapadamu
7 September - October ఆశ్వయుజము - Seventh Month Asvayujamu
8 October - November కార్తికము - Eighth Month Karthikamu
9 November - December మార్గశిరము - Ninth Month Margasiramu
10 December - January పుష్యము - Tenth Month Pushyami
11 January - February మాఘము - Eleventh Month Maghamu
12 February - March ఫాల్గుణము - Twelfth Month Phalgunamu

పక్షం అంటే తెలుగు నెలలోని ఒక సగాన్ని ఒక పక్షం అంటారు, అంటే తెలుగు నెలలోని పదిహేను రోజులను కలిపి ఒక పక్షం మరియు మరొక పదిహేను రోజులని కలిపి మరో పక్షం అంటారు.

మనకు మొత్తము పదిహేను తిధులు ఉన్నాయి, ఈ పదిహేను తిథుల లో పోర్ణమి మరియు అమావాస్య తప్ప ప్రతి తిథి మన తెలుగు నెలలో రెండుసార్లు కనిపిస్తుంది. ఇలా మొదటి పదిహేను తిధుల భాగాన్ని శుక్లపక్షం అని, దాని తరవాత ప్రారంభమయ్యే పదిహేను తిథులను కలిపి కృష్ణపక్షం మని పిలుస్తారు.

శుక్లపక్షం: శుక్లము అంటే తెలుపు. పూర్తి నలుపు (చీకటి) నుంచి తెలుపు (వెన్నెల) వైపుకు రాత్రిళ్ళు గడిచే నెల బాగాన్ని శుక్లపక్షము అంటారు. శుక్లపక్షం ప్రారంభమైన మొదటి రోజు (పాడ్యమి) నుంచి 15 వ రోజు వరకు క్రమేణా చంద్రుని ఆకారంలో మరియు వెన్నెలలో పెరుగుదల వస్తుంది. మొదటి తిథి అయిన పాడ్యమి తో ప్రారంభమై పౌర్ణమితో ముగుస్తుంది

కృష్ణ పక్షం: కృష్ణ అంటే నలుపు. ఈ కృష్ణపక్షంలో మొదటి రోజు రాత్రి అంటే పౌర్ణమి రోజు తర్వాత వచ్చే తిథి పాడ్యమి (వెన్నెల) నుంచి పదిహేనవ రోజు రాత్రి వచ్చే తిథి అమావాస్య (చీకటి) వరకు వెన్నెల క్రమేణా తగ్గుముఖం పట్టి పూర్తి చీకటితో ముగిస్తుంది.

తెలుగు తిథులు
SNO Telugu Thidi
1 మార్గశిర
2 విధియ
3 తదియ
4 చవితి
5 పంచమి
6 షష్టి
7 సప్తమి
8 అష్టమి
9 నవమి
10 దశమి
11 ఏకాదశి
12 ద్వాదశి
13 త్రయోదశి
14 చతుర్దశి
15 అమావాస్య/ పౌర్ణమి

వినాయక చవితి ఎప్పుడు వస్తుంది ?
భాద్రపద మాసం, శుక్ల పక్షం, చవితి రోజు వినాయక చవితి వస్తుంది.

ఇది మన సంస్కృతి, దినిని నేటి తరానికి తెలియ చేయాల్సిన బాధ్యత మనదే!!! వీలయినంత షేర్ చేయండి

No comments

Powered by Blogger.